బొడ్రాయి పండుగకు హాజరుకావాలని ఎంపీకి ఆహ్వానం
SDPT: చేర్యాల మండలం కడవేర్గులో ఈ నెల 29న నిర్వహించే బొడ్రాయి పండుగ ఉత్సవాలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఆహ్వానించారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్, సర్పంచ్ తాళ్లపల్లి రమేష్ బుధవారం ఎంపీకి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు. అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు ఎంపీ రావాలని వారు కోరారు.