VIDEO: రావులపాలెంలో తృటిలో తప్పిన ప్రమాదం
కోనసీమ జిల్లా రావులపాలెం బస్టాండ్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఓవర్టేక్ చేస్తున్న లారీ, ముందున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో నియంత్రణ కోల్పోయిన బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ బైక్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.