అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

చైనా షాంగ్జీ ప్రావిన్స్ తైయువాన్ నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఒక్కసారిగా మంటల చెలరేగి భవనం మొత్తం వ్యాపించడంతో దట్టమైన పొగ అలుముకుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.