పిడుగుపాటుకు ఎద్దు మృతి

పిడుగుపాటుకు ఎద్దు మృతి

NRPT: మాగనూరు మండలం పరిధిలోని అమ్మపల్లి గ్రామంలో రైతు కర్రే తాయపూలా బాలప్పకు చెందిన ఎద్దు శనివారం తెల్లవారుజామున పిడుగుపడి మృతి చెందింది. పొలంలో కట్టివేసిన ఎద్దుపై పిడుగు పడింది. ఎద్దు విలువ సుమారు రూ. 50 వేలు ఉంటుందని బాధితులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఎద్దు వద్ద రైతు కన్నీరుమున్నీరుగా విలపించారు.