VIDEO: గామాలపాడులో కార్డన్ సెర్చ్ నిర్వహణ
PLD: దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంఛార్జ్ డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది గ్రామంలోని ఇళ్లు, వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని సుమారు 40 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.