VIDEO: మందుల వినియోగంపై అవగాహన ర్యాలీ
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 'ప్రజా పాలన' కార్యక్రమంలో భాగంగా మందుల వినియోగంపై అవగాహన ర్యాలీని కలెక్టర్ రాజర్షిషా ఇవాళ ప్రారంభించారు. డాక్టర్ల సిఫారసు లేకుండా మెడికల్ స్టోర్లలో మందులు విక్రయించవద్దని, చిన్నపాటి వ్యాధులకు కూడా హైడోస్ మందులు వాడటం ఆరోగ్యానికి ప్రమాదకరమని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో DMHPO నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్, తదితరులు పాల్గొన్నారు.