విజయ్ మూవీలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్..?
రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న మూవీ 'రౌడీ జనార్ధన'. ఇందులో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే 'కూలీ'లో మెరిసిన పూజ, విజయ్‌తో కలిసి డ్యాన్స్ చేయనుండటం ఆసక్తిగా మారింది. ఇక ఈ మూవీ ఫ్లాష్‌బ్యాక్‌లో విజయ్ ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తాడని, మూవీ మొత్తానికి ఈ యాక్షన్ సీన్లే ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయని టాక్.