విద్యుత్ సరఫరాలో అంతరాయం

విద్యుత్ సరఫరాలో అంతరాయం

NGKL: కల్వకుర్తి మండలంలోని ఎల్లికల్ విద్యుత్ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు విద్యుత్ ఏఈ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని తిమ్మరాజు పల్లి, జంగారెడ్డిపల్లిలో ఉదయం 11:30 నుంచి సాయంత్రం 6:30 నిమిషాల వరకు విద్యుత్ ఉండదని ఆయన వెల్లడించారు. విద్యుత్ సిబ్బందికి వినియోగదారులు సహకరించాలని కోరారు.