కన్న కొడుకుపై కత్తితో తండ్రి దాడి
KMR: దోమకొండలో కన్న కొడుకు సాయిలుపై తండ్రి పోచయ్య దాడి చేసినట్లు ఎస్సై ప్రభాకర్ నిన్న తెలిపారు. నిద్రిస్తున్న సాయిలుపై పోచయ్య ఇంట్లోకి వచ్చి కత్తితో దాడి చేశాడు. సాయిలు అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి దాడిని అడ్డుకున్నారు. తీవ్రంగా గాయపడిన సాయిలును చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.