కార్మికుల బకాయి జీతాలు చెల్లించాలి

AKP: అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు బకాయి పడ్డ 3నెలలు జీతాలు తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆసుపత్రి సూపర్డెంట్‌కి వినతిపత్రం సమర్పించారు.