గుడిపల్లిలో వ్యవసాయ కార్మికుల నిరసన

గుడిపల్లిలో వ్యవసాయ కార్మికుల నిరసన

సత్యసాయి: సోమందేపల్లి మండలం గుడిపల్లిలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం కూలీలు నిరసన చేపట్టారు. పని ప్రదేశాల్లో కూలీలతో ఫేస్ యాప్ ఫోటోలు తీసే విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. సంఘం జిల్లా కమిటీ సభ్యుడు పెద్దన్న మాట్లాడుతూ.. మేట్లకు ఉచితంగా సెల్‌ఫోన్లు ఇవ్వాలని, కూలీలకు అవసరమైన పనిముట్లు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.