నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
VZM: శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు సందర్బంగా కొత్తవలస పాత రైల్వే స్టేషన్ వద్ద ఉన్న 100 మంది నిరుపేద కుటుంబాలకు 11నిత్యావసర సరుకులు ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి గురువారం పంపిణీ చేశారు. ముందుగా బాబాను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ట్రస్ట్ సభ్యులు సేవ దృక్పథం కలిగి ఉండడం అభినందనీయమన్నారు. మరిన్ని సేవలు అందించాలని కోరారు.