రేషన్ డీలర్‌పై కేసు నమోదు: RDO
E.G: రాజమండ్రిలోని నెం.39 రేషన్ షాపును ఆర్డీవో కృష్ణనాయక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ అందుబాటు, పంపిణీ రిజిస్టర్లు, ఆన్‌లైన్ రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. స్టాక్‌కు, రికార్డులకు మధ్య 360 కిలోల బియ్యం అదనంగా ఉన్నట్లు గుర్తించారు. సంబంధిత రేషన్ షాపు డీలర్‌పై నిత్యావసర సరుకుల యాక్ట్ సెక్షన్ 6A కింద కేసు నమోదు చేశారు.