బస్ షెల్టర్ ఏర్పాటుపై చర్యలు: జిల్లా ప్రజా రవాణా అధికారి

బస్ షెల్టర్ ఏర్పాటుపై చర్యలు: జిల్లా ప్రజా రవాణా అధికారి

మన్యం: వీరఘట్టంలో బస్ షెల్టర్ ఏర్పాటుకు పంచాయతీ అధికారి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేసినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి పి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 14న ఓ పత్రికలో ప్రచురితమైన 'ప్రయాణికులకు నిలువ నీడేదీ' అనే శీర్షికపై గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వీరఘట్టంలో ఆర్టీసీకి సొంత స్థలం లేదని, షెల్టర్ ఏర్పాటుపై పలుమార్లు లేఖలు రాయడం జరిగిందన్నారు.