బోథ్ మాజీ ఎమ్మెల్యేని పరామర్శించిన రామన్న

ADB: బోథ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును మాజీ మంత్రి జోగు రామన్న పరామర్శించారు. రాథోడ్ బాపురావు సోదరుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాథోడ్ నర్సింగ్ శుక్రవారం హఠాన్మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి రామన్న మాజీ ఎమ్మెల్యే స్వగృహానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.