విజయవంతమైన ఉచిత నేత్ర వైద్య శిబిరం

విజయవంతమైన ఉచిత నేత్ర వైద్య శిబిరం

PPM: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ, పుష్పగిరి ఆసుపత్రి సహకారంతో పార్వతీపురం లయన్స్ కళ్యాణ మండపంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. నేత్ర వైద్య అధికారి జీరు నగేష్ రెడ్డి పర్యవేక్షణలో డా. యాళ్ల వివేక్ 150 మందికి పరీక్షలు చేశారు. వీరిలో దృష్టి లోపం ఉన్న 30 మందిని గుర్తించి ఆపరేషన్ల నిమిత్తం పంపారు.