VIDEO: ఆసక్తిగల దాతలు ముందుకు రావాలి: కలెక్టర్
కృష్ణా: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం ఓ ముఖ్యమైన వీడియో ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని స్మశాన వాటికలను పీ-4 కింద అభివృద్ధి చేయడానికి ఆసక్తిగల దాతలు ముందుకు రావాలని పేర్కొన్నారు. స్మశాన వాటికల రూపురేఖలను మార్చి, వాటిని మెరుగ్గా తీర్చిదిద్దడానికి దాతల సహకారం కోరారు. ఎవరైనా ముందుకు వస్తే, స్మశాన వాటికల అభివృద్ధికి కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.