క్రైస్తవ సమాధుల ఆక్రమిత స్థలాన్ని పరిరక్షించాలని నిరసన

కృష్ణా: క్రైస్తవ సమాధుల స్థలాన్ని ఆక్రమణ దారుల నుండి పరిరక్షించాలని క్రైస్తవ సంఘాలు బుధవారం సాయంత్రం ఉయ్యూరు సెంటర్‌లో నిరసన తెలిపారు. క్రైస్తవ సంఘ కాపరులు, విశ్వాసులు మాట్లాడుతూ.. ఉయ్యూరు పట్టణంలోని మూడు డొంకల రోడ్డులో క్రైస్తవుల కోసం ఏర్పాటు చేసిన సమాధుల స్థలాన్ని చుట్టు ప్రక్కల వారు ఆక్రమిస్తున్నారు వాటిని పరిరక్షించాలి అని పేర్కొన్నారు.