బడుల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిది

సూర్యపేట: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఆధారపడి ఉందని ప్రభుత్వ ఉపాధ్యాయుడు వి. భరత్ బాబు శనివారం కోదాడలో ఉద్ఘాటించారు. మాతృభాషలో ప్రాథమిక విద్యను విద్యార్థులు అభ్యసించడం వలన వారిలోని ప్రతిభ వెలుగులోనికి వస్తుందని.. ఇది ప్రపంచ మేధావులు చెప్పిన అక్షరసత్యమన్నారు.