నలుగురి పై అట్రాసిటీ కేసు నమోదు
VZM: కొత్తవలస పట్టణ కేంద్రం రాంజీనగర్ ప్రాంతానికి చెందిన కొట్యాడ జ్ఞానేశ్వరి విజయనగరం పూల్ బాగ్ కాలనీ చెందిన కేశవరాముతో ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహం కావడంతో భర్త, అత్త మామ, ఆడపడుచు తరచూ కట్నం కోసం వేధిస్తున్నారు. బాధితురాలు విసుగు చెంది పోలీసు స్టేషను లో పిర్యాదు చేయడంతో వారిపై అట్రాసిటీ, కేసు నమోదు చేసినట్లు సీఐ షణ్ముఖరావు తెలిపారు.