జామి మండలంలో ప్రజాదర్బార్
VZM: జామి మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎస్.కోట MLA కోళ్ల లలిత కుమారి శనివారం ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. జామి మండలంతో పాటు నియోజకవర్గంలో ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభ్యర్థనలు ఎమ్మెల్యేకు అందజేశారు. వీలైనంత త్వరగా పరిష్కారం వచ్చేలా చర్యలు తీసుకుంటామని MLA తెలిపారు.