విటమిన్ డి ట్యాబ్లెట్లను వాడుతున్నారా?
దేశంలో ప్రస్తుతం అధిక శాతం ప్రజలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. చిన్నారుల్లోనూ ఈ సమస్య అధికంగా ఉంటోంది. అయితే, విటమిన్ డి ట్యాబ్లెట్లను వాడేవారు సొంతంగా వాడొద్దు. డాక్టర్ సూచన మేరకు ఉపయోగించాలి. విటమిన్ డి లోపం ఉంటే మన శరీరానికి తగిన విధంగా డాక్టర్లు డోసు నిర్ణయిస్తారు. విటమిన్ డి ట్యాబ్లెట్లను ఎక్కువ కాలం వాడితే శరీరం విషతుల్యంగా మారుతుంది. దీంతో పలు వ్యాధులు వస్తాయి.