దారుణం.. ముక్కలుముక్కలుగా నరికి హత్య
RR: అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఓ వ్యక్తిని ముక్కలుముక్కలుగా నరికి చంపారు. అనంతరం ఆధారాలు దొరకకుండా శరీర భాగాలను వేరువేరు ప్రాంతాల్లో పడేశారు. విచారణలో భాగంగా పోలీసులకు మృతుడి తల మాత్రమే లభించింది. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.