'ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి'

KDP: ఈనెల 27న గండికోట పర్యాటక కేంద్రంలో నిర్వహించే ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కడప కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. శనివారం గండికోట అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ మీటింగ్ హాలులో కమిటీ మెంబర్లతో కలిసి అనుబంధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ వేడుకల్లో భాగంగా గండికోట పర్యటక కేంద్రంలో కనీస, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.