ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీక: ఎమ్మెల్యే

ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీక: ఎమ్మెల్యే

BDK: పవిత్ర రంజాన్ మాసంలో జరుపుకునే ఇఫ్తార్ విందు కార్యక్రమాలు సోదరభావానికి, మత సామరస్యానికి నిలుస్తున్నాయని MLA, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. రంజాన్ మాసం సందర్బంగా పట్టణంలోని జామా మసీదులో శనివారం జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.