VIDEO: పెద్దపులి కలకలం.. రెండు ఆవులు మృతి
NZB: భీమగల్ మండలం దేవక్కపేట్ శివారులో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. రెండు ఆవులపై బుధవారం రాత్రి పులి దాడి చేసి చంపేసినట్లు బాధితుడు భూక్యా చంద్రు తెలిపారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో రైతులు పొలం పనులకు వెళ్లవద్దని, పగటిపూట అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు.