'ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుంది'

NTR: కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఏ.కొండూరు మండలం పాత రేపూడి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.