VIDEO: వంతెన సౌకర్యం లేక అవస్థలు

VIDEO: వంతెన సౌకర్యం లేక అవస్థలు

అల్లూరి: ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు గిరిజనులకు తీవ్రమైన ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. అరకులోయ మండలంలోని సిరిగం పంచాయతీ పరిధిలోని నడిమివలస గ్రామానికి వెళ్లే మార్గంలో వంతెన లేకపోవడంతో, వరద ప్రవాహంలో గిరిజనులు ప్రాణాలను పణంగా పెట్టి దాటుతున్నారు. నిత్యావసరాల కోసం అనేక ఇబ్బందులు తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు.