'బీసీ 42% రిజర్వేషన్ ఒక డ్రామా'
HNK: బీసీలకు 42% రిజర్వేషన్ అమలు నిర్ణయం ఒక డ్రామా అని మాజీ మంత్రి దయాకర్ రావు అభివర్ణించారు. BRS పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం తీసుకున్న నిర్ణయాలు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నిజమైన బీసీ హితకామి అని, ప్రజలు ఈ మోసపూరిత ప్రకటనలకు మోసపోవద్దని పిలుపునిచ్చారు.