'బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే'
NZB: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్‌లో గురువారం మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ జేఏసీ రాష్ట్ర కో-ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు రోజుకో విధంగా నిరసన తెలుపుతున్నామన్నారు.