జిల్లా అన్న క్యాంటీన్‌లపై వార్ ఎఫెక్ట్
కాకినాడ జిల్లాలోని 11 అన్న క్యాంటీన్లకు ఆహారం అందించే అక్షయ పాత్ర సంస్థకు గ్యాస్ కొరత ఏర్పడింది. యుద్ధ ప్రభావం వల్ల రోజుకు అవసరమైన 12 సిలిండర్లు అందడం లేదని మేనేజర్ రాజశేఖర్ గురువారం తెలిపారు. భారత్ గ్యాస్ నుంచి సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. పేదలకు నిరంతరాయంగా భోజనం అందించేందుకు వీలుగా సిలిండర్లు కేటాయించాలన్నారు.