జిల్లా రైతులకు శుభవార్త

కృష్ణా: ఉమ్మడి కృష్ణా జిల్లాలో పండ్ల తోటల పెంపకానికి ఉపాధి హామీ పథకం ఊతమిస్తోంది. మామిడి, జామ, నిమ్మ వంటి పంటలకు మొక్కలు, ఎరువులు, దుక్కి దున్నడం, అంతరపంటలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న సన్నకారు రైతులు అర్హులు. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికే 2,600 హెక్టార్లలో తోటల పెంపకానికి రైతులు దరఖాస్తు చేసుకున్నారు.