గంధం మహోత్సవ ఏర్పాట్లను పరిశీలన

ప్రకాశం: పామూరు పట్టణంలోని స్థానిక సీఎస్‌పురం రోడ్డులో రేపు గురువారం నిర్వహిస్తున్న శ్రీ మహబూబ్ సుభాని గంధం మహోత్సవ ఏర్పాట్లను బుధవారం పామూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ భీమా నాయక్, ఎస్సై కిషోర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. రేపు గంధం మహోత్సవంలో ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని నిర్వాహకులకు సూచించారు.