video: నేలకొరిగిన విద్యుత్ స్తంభం సరి చేయాలి'

video: నేలకొరిగిన విద్యుత్ స్తంభం సరి చేయాలి'

SRD: కంగ్టి మండలం దెగులవాడి శివారులో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ సంబంధించిన స్తంభం నేలకొరిగి రెండు నెలలు కావస్తోంది. ఆ స్తంభానికి సరఫరా నిలిపివేశారు. అయితే ఇంతవరకు స్తంభం సరి చేయలేదని, వ్యవసాయానికి కరెంట్ కనెక్షన్ లేక పంటలకు సేద్యం నిలిచిందని రైతులు ఇవాళ తెలిపారు. సంబంధిత విద్యుత్ సిబ్బందికి తెలిపిన పట్టించుకోలేదని, ఇప్పటికైనా సరి చేయాలని రైతులు కోరారు.