ఎండల మల్లికార్జున స్వామి సేవలో ఎమ్మెల్యే, ఎంపీ

ఎండల మల్లికార్జున స్వామి సేవలో ఎమ్మెల్యే, ఎంపీ

SKLM: రణస్థలం మండలం బంటుపల్లి–కంబాలపేటలో వెలిసియున్న శ్రీ ఎండల మల్లికార్జున స్వామి ని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్న సమారాధనలో పాల్గొన్నారు .