బాలికతో అసభ్య ప్రవర్తన.. భార్యాభర్తలకు జైలు శిక్ష

NTR: విజయవాడ భవానీపురంలో ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి, అతడికి సహకరించిన భార్యకు జైలు శిక్ష పడింది. భవానీపురంలో నివాసం ఉండే శరత్ కుమార్ అనే వ్యక్తి 2019 అక్టోబర్ 8న బాలిక ఇంట్లోకి చొరబడి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం శరత్ కుమార్‌కు మూడేళ్లు జైలు శిక్ష విధించగా, అతని భార్యకు ఏడాది జైలు శిక్ష విధించింది.