'ఉపాధ్యాయుల జీతాలపై వ్యాఖ్యలు ఉపసంహరించాలి'
WGL: వర్ధన్నపేట పట్టణంలో తెలంగాణ విద్యా కమిషన్ నివేదికలో ఉపాధ్యాయులకు అధిక జీతాలు ఉన్నాయని పేర్కొనడాన్ని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు ధరావత్ కిషన్ నాయక్ ఆదివారం ఖండించారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలోని కమిషన్ జీతాల తగ్గింపుపై వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. జీతభత్యాల అంశాన్ని నివేదిక నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.