భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. దీంతో పలు రోడ్లు జలమయమయ్యాయి. ఇవాళ రాత్రి కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం అత్యవసర సాయం కోసం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.