బోనమెత్తిన డిప్యూటీ సీఎం సతీమణి

KMM: ఆషాఢ బోనాలు సందర్భంగా ప్రజా భవన్ నుంచి డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి, అమ్మ ఫౌండేషన్ ఛైర్మన్ మల్లు నందిని విక్రమార్క సంప్రదాయంగా బోనాలు తయారు చేశారు. అనంతరం బోనాలను ఎత్తుకొని ఎల్లమ్మ తల్లికి సమర్పించారు. అదేవిధంగా ఎల్లమ్మ తల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు.