గద్వాల్ రైల్వే స్టేషన్ రోడ్డు గుంతలమయం
GDWL: గద్వాల్ రైల్వే స్టేషన్ వద్ద కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకంలో భాగంగా వివిధ అభివృద్ధి పనులు చేస్తున్నారు. అయితే రెండు వైపుల సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. సీసీ రోడ్డు మీద కంకర పోయి వదిలివేయడంతో వాహనాల రాకపోకలకు గుంతలు పడ్డాయి. వర్షకాలం కావడంతో భారీగా నీళ్లు నిలిస్తున్నాయి. దీంతో రైల్వే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.