బాలికల చదువుపై శాశ్వత నిషేధం
ఆఫ్ఘనిస్తాన్ విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. బాలికలు పాఠశాలలకు వెళ్లకుండా శాశ్వత నిషేధం విధిస్తూ అక్కడి మంత్రి కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే మహిళల స్వేచ్ఛపై అనేక ఆంక్షలు ఉన్న తాలిబన్ పాలనలో, ఇప్పుడు ఏకంగా విద్యకు దూరం చేయడం చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం లక్షలాది మంది బాలికల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.