మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని మంత్రికి వినతి

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని మంత్రికి వినతి

జగిత్యాల నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని మంత్రి నాగేశ్వర్ రావును జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కలిసి వినతిపత్రం సమర్పించారు. మొక్కజొన్న పంట అధిక మొత్తంలో సాగు అవుతుందని, పంట కోతకు వచ్చినందున రైతులకు ఇబ్బందులు లేకుండా, దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ద్వారా మార్కుఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.