VIDEO: యూరియా కొరతతో రోడ్డెక్కిన రైతులు

VIDEO: యూరియా కొరతతో రోడ్డెక్కిన రైతులు

NRML: కడెం మండల కేంద్రంలో యూరియా కొరతతో రైతులు నిర్మల్-మంచిర్యాల్ రహదారిపై ధర్నా నిర్వహించారు. గత వారం రోజులుగా మారుమూల గ్రామాల నుంచి వచ్చి యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి రైతులకు కొరత లేకుండా యూరియా బస్తాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు.