వర్మీ కంపోస్ట్‌ను పరిశీలించిన కమిషనర్

GNTR: పొన్నూరు పురపాలక సంఘ కమిషనర్ ముప్పాళ్ల రమేశ్ బాబు మంగళవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అందులో భాగంగా స్థానిక డంప్ యార్డులో తడి చెత్త నుంచి ఎరువు తయారీ కేంద్రంలో(వర్మీ కంపోస్ట్) జరుగుతున్న పనులను పరిశీలించారు. అలాగే MRF (మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ) కేంద్రంలో పొడి చెత్తను వేరు చేసే విధానంలో సిబ్బందికి పలు సూచనలు చేశారు.