రీ సర్వే ముగింపు ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్
VZM: కొత్తవలస మండలం మిందివలస రామచంద్రాపురం, తుమ్మికాపల్లి, ఉత్తరాపల్లి, చీడివలస గ్రామాలలో రీ సర్వే ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఆయా గ్రామాల్లో రీ సర్వే పూర్తి కావడంతో ఈనెల 9న, జారీచేసే ముందు క్షుణ్ణంగా రీ సర్వే పరిశీలించి పట్టాదారు పాసుపుస్తకాలు రైతులకు పంపిణీ చేస్తామని ఇన్‌ఛార్జ్ తహసిల్దార్ పి.సునీత తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.