బైకును తగలబెట్టిన దుండగులు
ప్రకాశం: గిద్దలూరు మండలం వెల్లుపల్లి గ్రామంలో శుక్రవారం గుర్తుతెలియని దుండగులు జంగాల రవికి చెందిన బైకుని ఊరి బయటకు తీసుకువెళ్లి తగలబెట్టారు. ఉదయాన్నే వాహనం కనిపించకపోవడంతో వెతుకుతుండగా, గ్రామ సమీపంలో బూడిదైన స్థితిలో వాహనం కనిపించింది. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.