కేజీబీవీలో భోజనం కోతపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు

కేజీబీవీలో భోజనం కోతపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు

NGKL: తిమ్మాజీపేట కేజీబీవీలో మెనూ ప్రకారం ఆహారం అందించకుండా అక్రమాలకు పాల్పడుతున్న ఎస్ఓను సస్పెండ్ చేయాలని బీఎస్ఎఫ్ నాయకులు ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. 230 మంది విద్యార్థుల భోజనంలో కోత విధిస్తున్నారని ఆరోపిస్తూ, బాధ్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై ఉన్నత అధికారులు స్పందించాలని కోరారు.