ఎమ్మెల్యేను కలిసిన ఎంపీడీఓ
GDWL: గద్వాల మండల నూతన ఎంపీడీఓ (మండల పరిషత్ అభివృద్ధి అధికారి)గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ శైలజ, మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ శైలజ ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎంపీడీఓ మండల విధులను సక్రమంగా నిర్వహించాలనరు.