ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు అతిధిగా బండ ప్రకాష్

ASF: ఈనెల 17న నిర్వహించనున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం అతిథులను ఖరారు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ CS రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆసిఫాబాద్ జిల్లాకు శాసనమండలి డిప్యూటీ ఛైర్మెన్ బండ ప్రకాశ్ రానున్నారు. బుధవారం ఉదయం 9.30గంటలకు జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండావిష్కరణ, గౌరవ వందనం స్వీకరిస్తారు. అభివృద్ధి పనులపై ప్రసంగిస్తారు.