VIDEO: సూర్యప్రభ వాహనంపై లంభోధరుడి విహారం

CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రత్యేక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారు సూర్యప్రభ వాహనంపై విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కాణిపాకం పురవీధుల్లో నిర్వహించిన గ్రామోత్సవంలో భారీగా భక్తులు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.